'ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య'
NRML: నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్‌లోని ప్రభుత్వ బాలుర ఆశ్రమం ఉన్నత పాఠశాలలో "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాల సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. పోషకులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని తెలిపారు.