దీక్ష విరమించిన వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్

BPT: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్ బాబు సోమవారం రాత్రి దీక్ష విరమించారు. రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. కాలువలు పూర్తిస్థాయిలో బాగు చేస్తామని హామీ ఇప్పించటంతో దీక్ష విరమించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిమ్మరసం ఇచ్చారు.