అన్నానగర్ కాంగ్రెస్ నేతల సమావేశం

HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలో జై బాపూ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం అన్నానగర్ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్నగర్, సీతమ్మ పోచమ్మ టెంపుల్, బాలంరాయి మీదుగా లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ముఖ్య అతిథిలుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.