రూ. 7 కోట్లకు రీ ఎస్టిమేట్.. నిర్మాణ పనులు వేగవంతం

రూ. 7 కోట్లకు రీ ఎస్టిమేట్.. నిర్మాణ పనులు వేగవంతం

వరంగల్‌లో నగరంలో నిర్మిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు రాజకీయ లబ్ధి కోసమే శంకుస్థాపనలు చేసి పనులు మాత్రం జరగలేదని విమర్శించారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 7 కోట్లకు రీ ఎస్టిమేట్ చేయించి, నిర్మాణ పనులు వేగవంతం చేశాయని ఆయన తెలిపారు.