పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతులకు పంట నష్టపరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.