వరద బాధిత కుటుంబాలకు రూ.12.99 కోట్లు

వరద బాధిత కుటుంబాలకు రూ.12.99 కోట్లు

TG: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8,662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు. నేరుగా బాధిత కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.