'సైకిల్ పార్కింగ్ స్టాండ్ ఏర్పాటు చేయాలి'

NDL: నంది కోట్కూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సైకిల్ స్టాండ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి, ఆర్టీసీ డీఎం నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సైకిల్, బైక్ స్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు చర్యలు తీసుకుని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.