భయపెడుతున్న 'ఈషా' ట్రైలర్
ప్రముఖ నటి హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ 'ఈషా'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హర్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ట్రైలర్ భయపెడుతోంది. ఇక దర్శకుడు శ్రీనివాస్ మన్నే రూపొందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతుంది. ఇందులో అఖిల్ రాజ్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.