VIDEO: జగనన్న కాలనీలో అధ్వానంగా రోడ్లు

NTR: ఇబ్రహీంపట్నంలో జగనన్న కాలనీ పరిస్థితులు దారుణంగా మారాయి. కురిసిన వర్షాలకు రోడ్లన్నీ బురద మయమయ్యాయి. మంగళవారం స్థానికులు బురదపై నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నిసార్లు అధికారంలోకి చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదగామారిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.