నమాజ్‌లో పాల్గొన్న ఎంపీ
విజయనగరం ఈద్గా మస్జీద్‌లో జరిగిన ఈద్-ఉల్-ఫితర్ నమాజ్‌లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తానని తెలియజేశారు.