ముథోల్‌లో దొంగ ఓట్ల కలకలం

ముథోల్‌లో దొంగ ఓట్ల కలకలం

నిర్మల్ జిల్లా ముథోల్‌లో దొంగ ఓట్ల ఘటన కలకలం రేపింది. ఒక యువకుడు ఓటు వేసిన తర్వాత వేలిపై ఉన్న సిరాను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి సిరాను తొలగించేందుకు ఉపయోగించే కెమికల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.