'అఖిలభారత మహాసభలు జయప్రదం చేయాలి'
VZM: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి కోరారు. సోమవారం గజపతినగరం దిగువవీధిలో జిల్లా కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీనికి దేశం నలుమూలల నుండి 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు.