భరోసా సెంటర్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ
నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్‌ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం భవనంలో ఏర్పాటు చేసిన పలు గదులను పరిశీలించారు .వీరి వెంట జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. భరోసా సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను పోలీసులు డీజీపీకి వివరించారు.