కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

NRML: జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండుకుండల మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 4.69 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.245 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. కాగా 2 గేట్లు ఎత్తి 15022 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు.