నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం

NGKL: తెలకపల్లి మండలంలోని 33 కేవీ లైన్ తీగల కింద ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టనుండడంతో గురువారం ఉ. 7 గంటల నుంచి మ. 12 గంటల వరకు కరెంట్ కట్ చేస్తామని ఏఈ శాంతన్ తేజ ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న ముద్దునూరు, తాళ్లపల్లి, నాగర్ కర్నూల్, పుల్జాల పరిధిలోకి వచ్చే గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఏఈ కోరారు.