VIDEO: ప్రథమ మండల పూజకు హాజరు కానున్న మంత్రి వివేక్
MNCL: బెల్లంపల్లి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ప్రథమ మండల పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. మంత్రితోపాటు స్థానిక MLA వినోద్, BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పూజకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.