VIDEO: ప్రైవేట్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
VZM: ఒడిసా ప్రైవేట్ బస్సు రామభద్రపురం సమీపంలో శనివారం తెల్లవారుజామున పూర్తిగా దగ్ధమయ్యింది. భువనేశ్వర్ నుంచి బయలుదేరిన బస్సు రామభద్రపురం వచ్చే సరికి వెనుక టైరుకు మంటలు మొదలై బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.