ప్రత్యేక పూజలు చేసిన CI
చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం గ్రామంలోని నారాయణస్వామి ఆలయాన్ని సీఐ దుర్గాశి వినోద్ కుమార్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు.