ఎన్నికల వేళ సీఎంకు భారీ షాక్
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార LDF కూటమికి భారీ షాక్ తగిలింది. ఆ కూటమికి చెందిన నట్టికా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ముకుందన్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకుల సమక్షంలో కమలం పార్టీ జెండాను కప్పుకున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ముకుందన్ నమ్మి తమ పార్టీలో చేరినట్లు బీజేపీ నేతలు తెలిపారు.