నగరంలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రం సీజ్..!
HYD: నగరంలో దేనిని వదలకుండా నకిలీలు తయారు చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని భోలానగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. దాదాపు 530 కేజీల కల్తీ నెయ్యి, అలాగే తయారీకి వాడే బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.18 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు.