బైక్‌లు చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

కోనసీమ: అయినవిల్లి మండలంలో మోటార్ సైకిల్‌లు దొంగతనం చేసిన కేసులో ఒక వ్యక్తి ని, ఒక మైనర్ బాలుడుని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై హరి కోట శాస్త్రి తెలిపారు. ఈ కేసులో సిరిపల్లికి చెందిన పవన్ కుమార్‌తో పాటు మరో బాలుడుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. వీరిలో ప్రధాన నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. బాలుడిని జువైనల్ హోంకి పంపించారన్నారు.