పంద్రాగష్టు వేడుకలకు ఒకే పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు

పంద్రాగష్టు వేడుకలకు ఒకే పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు

SRPT: భారత రక్షణ శాఖ నిర్వహించిన జాతీయ క్విజ్‌లో కోదాడ తేజ విద్యాలయానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులు ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. జూన్ 15 నుండి జూలై 31 వరకు జరిగిన ఈ ఆన్‌లైన్ పోటీలో దేశవ్యాప్తంగా 2.15 లక్షల మంది విద్యార్థులు పోటీపడగా.. తేజ విద్యాలయం నుంచి 15 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.