నెల్లూరు జైలుకు జోగి రమేష్
AP: నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను సిట్ అధికారులు విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వారికి ఈ నెల13 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.