క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

GDWL: మల్లకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో ఎల్కూర్ ప్రీమియర్ లీగ్ (EPL) సీజన్-11 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఈ లీగ్ విజయవంతంగా కొనసాగుతోందని, టోర్నమెంట్‌ను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు.