VIDEO: 'ఆఖరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలి'
MHBD: పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం ఏమరుపాటు వద్దని, ఆఖరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సిబ్బందికి సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మానుకోట పట్టణ శివారులోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం ఎస్పీ పర్యటించారు. ఈ సందర్బంగా పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసులకు, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు.