'వరి కొనుగోళ్ళు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
MBNR: ఎర్రవల్లి (M) పరిధిలోని తిమ్మాపూర్ రైతు వేదికలో ఇవాళ ఆయా గ్రామాల ఏఈవోలకు MAO సురేష్ గౌడ్ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి కొనుగోళ్ళు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోళ్ళు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు, తేమ శాతం మిషన్లు, రిజిస్టర్లు పెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు నరేష్, ప్రవల్లిక, సురేష్, తదితరులు పాల్గొన్నారు.