స్మృతి మంధాన తండ్రి హెల్త్ UPDATE
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో మహారాష్ట్రలోని సాంగ్లిలో సర్విత్ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు. ఉదయం 11:30 గంటలకు ఆయనకు ఎడమ వైపు ఛాతీ నొప్పి వచ్చిందని తెలిపారు. ఆయనకు కార్డియాక్ ఎంజైమ్‌లు కొద్దిగా పెరిగాయని.. నిరంతర ECG పర్యవేక్షణ, అవసరమైతే యాంజియోగ్రఫీ అవసరం కావచ్చని పేర్కొన్నారు.