బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మాడవీధుల్లో సమీక్ష

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నాలుగు మాడ వీధుల్లో క్షేత్రస్థాయిలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజులపాటు అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు ఏర్పాట్లపై చర్చించారు.