లింగాపూర్ శివారులో కారు దగ్ధం
KMR: మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామ స్టేజి వద్ద శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. లింగాపూర్‌కు చెందిన అనిల్ తన కారులో గ్రామానికి వెళ్తుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అనిల్, కారును పక్కకు ఆపి ప్రాణాలు కాపాడుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.