అంతర్జాతీయ క్రీడాకారుడికి ఆహ్వానం

VSP: స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని (గవర్నర్ బంగ్లా)లో జరగనున్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీకాకుళానికి చెందిన అంతర్జాతీయ వాలీబాల్ ఛాంపియన్ అట్టాడ చరణ్‌కు ఆహ్వానం అందింది. ప్రస్తుతం అట్టాడ చరణ్ విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) అకాడమీలో శిక్షణ పొందుతూ గాజువాక వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు.