సీపీఐ మరో వంద సంవత్సరాలు గుర్తుండాలి: MLA
BDK: దేశ రాజకీయ చరిత్రలో వందేళ్లు ప్రజల కోసం పనిచేసిన ఘనత కేవలం సీపీఐ పార్టీదేనని రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను మరో వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమితి సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.