భద్రాచలం రామయ్యను దర్శించుకున్న కమిషనర్
BDK: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బొరెడ్డి అయోధ్యా రెడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కమిషనర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. అయోధ్యా రెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించి, భద్రాచల దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి వ్యక్తం చేశారు.