VIDEO: ఓక్ ల్యాండ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్, వార్షికోత్సవ వేడుకలు
VZM: జమ్ము ఓక్ ల్యాండ్ స్కూల్లో కిండర్‌గార్టెన్ గ్రాడ్యుయేషన్ మరియు వార్షికోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ డా. శ్రీనివాసరావు చేపా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించి సర్టిఫికెట్లు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.