ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించామని PACS ఛైర్మన్ పారేపల్లి మణిబాబు తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. అలాగే రైతులు తేమ శాతం, బస్తాల కొరత, తూకాల సమస్యలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.