VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

W.G: మార్టేరు నుంచి అత్తిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం ఆలమూరు వద్ద ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు పల్టీ కొట్టింది. అయితే కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.