ఆస్పత్రిలోనే FIR.. పోలీసుల సత్వర స్పందన..!
SRPT: బాధితుల ముంగిటకే పోలీస్ సేవలను చేరవేస్తూ సూర్యాపేట రెండో పట్టణ పోలీసులు ఆదర్శంగా నిలిచారు. మంగళవారం జాతీయ రహదారిపై ఆటో-కారు ఢీకొన్న ప్రమాదంలో బాలెంల గ్రామానికి చెందిన వెంకన్న కుటుంబంలోని నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై శివతేజ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.