ఎస్టీయూ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ
ప్రకాశం: మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టడీ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం ఇచ్చిన మెటీరియల్ వల్ల 80% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.