అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NZB: వేల్పూర్ మండలం జానకంపేట్ గ్రామంలో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం జానకంపేట్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.