వాగులోకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరు మృతి

వాగులోకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరు మృతి

పోలవరం జిల్లా చింతూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకుని వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.