పాక్‌లో భారీగా పెరిగిన అఫ్గాన్ పౌరుల అరెస్టులు

పాక్‌లో భారీగా పెరిగిన అఫ్గాన్ పౌరుల అరెస్టులు

పాకిస్తాన్‌లో అఫ్గాన్ జాతీయుల అరెస్టులు, నిర్బంధాలు గత వారంలో 146 శాతం పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అక్టోబరు 26 నుంచి ఈనెల 1 వరకు మొత్తం 7,764 మంది అఫ్గాన్ పౌరులను పాక్ అరెస్టు చేసినట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే నిర్బంధించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అరెస్టులు, నిర్బంధాలు అత్యధికంగా బలూచిస్తాన్ కేంద్రంగానే జరిగాయి.