అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

AKP: జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం కలెక్టరేట్‌లో మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమాలను వేగవంతంగా చేయడానికి ఈ మొబైల్ ఫోన్లు దోహదపడతాయన్నారు. పోషణ, ఆరోగ్యం, హాజరు తదితర కార్యక్రమాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం వల్ల సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందన్నారు.