ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
GDWL: గద్వాల పట్టణంలోని దయానంద విద్యా మందిర్లో జోగులాంబ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు శ్రావణి, కృష్ణవేణి రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డా. విజయభాస్కర్ రెడ్డి బృందం కోరింది. ఈ శిబిరంలో వందలాది మంది రోగులు పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.