అక్క సర్పంచ్.. చెల్లి కలెక్టర్!
TG: ఖమ్మం జిల్లా తెట్టెలపాడు గ్రామ సర్పంచ్‌గా BRS బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలుపొందారు. ఈ సందర్భంగా నర్సమ్మను ఆమె చెల్లి(పిన్ని కూతురు), కర్ణాటక గుల్బర్గా జిల్లా కలెక్టర్ హెప్సిబారాణి అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శపాలన అందించాలని ఆకాంక్షించారు. కాగా నర్సమ్మ ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు.