అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WGL: నర్సంపేట నియోజకవర్గం ముత్తూజిపేట గ్రామంలో రూ. 80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సెంటర్ లైటింగ్స్ అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.