'నిబంధనలకు అనుగుణంగా అర్జీలను పరిష్కరించాలి'
PDPL: నిబంధనలకు అనుగుణంగా అర్జీలు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో భూభారతి రెవెన్యూ నీటిపారుదల సర్వే అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూభారతి సాదా బైనమా కింద వచ్చిన అర్జీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.