నేటి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం
ASR: పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సర అడ్మిషన్లకు 22వ తేదీ శనివారం (నేడు)చివరి రోజు అని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం డిగ్రీలో కెమిస్ట్రీ-5, ఫిజిక్స్-3, కంప్యూటర్ సైన్స్-2 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా కళాశాలను సంప్రదించాలని తెలిపారు.