RDTకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌పై ఎమ్మెల్యే హర్షం
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నుంచి కేంద్రం వరకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ సేవలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సత్వర న్యాయం చేకూర్చామన్నారు.