VIDEO: జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం

VIDEO: జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం

అల్లూరి: గడచిన 24గంటల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పాడేరు మండలంలో అత్యధికంగా 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. హుకుంపేట 112.6, అనంతగిరి 102.6, జీ.మాడుగుల 94, ముంచంగిపుట్టు 74.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,137.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.