స్మృతి మంధాన సరికొత్త రికార్డు
భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 45 పరుగులు చేసింది. దీంతో ఒకే వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధికంగా 434 పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే, ఈ సీజన్ ప్రపంచకప్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మంధాన కొనసాగుతోంది.