ఆలయాల్లో భక్తుల భద్రతపై DY.CM పవన్ కీలక ఆదేశాలు
KKD: కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై DY.CM పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించిన ఆయన క్యూలైన్ల నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాశీబుగ్గ ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు పని చేయాలన్నారు.